యువతలో సృజనాత్మకతకు అవకాశాలంటూ రాఘవేందర్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
టెక్నాలజీతో యువతకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని టాస్క్ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ ఫిల్మ్‌మేకింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్‌తోనే అద్భుతమైన విజువల్స్ సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న యాభై ఆరుగురు విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.