అనారోగ్యంతో బాధపడుతున్న ఐద్వా నాయకురాలు విజయను ఆప్యాయంగా పరామర్శించిన సీపీఎం నేతలు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఇటీవల మోకాలు ఆపరేషన్ చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోతు విజయను సిపిఎం మండల నాయకులు ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న, సిఐటియు మండల అధ్యక్షుడు అంబటి లక్ష్మణ్ తదితరులు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.