మర్రిపాడులో విషాదం.. ఫ్యానుకు ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య!
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లిలో హనీ అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లో ఉన్న ఐదు నెలల చిన్నారిని సురక్షితంగా కాపాడారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. భర్త జాన్ అలియాస్ చోటు పరారీలో ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.