మనుబోలులో వైభవంగా గణనాధునికి ఏడవ రోజు ప్రత్యేక పూజలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వకీల్ పేట రాజా వీధిలో ఏర్పాటు చేసిన గణనాధుని మండపాల వద్ద అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఏడవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజలు, కుంకుమార్చన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉభయదాతలుగా అడపాల హరి రూపినీ, నవకోటి మజందర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు విరివిగా పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.