అమెరికా హాల్ ఆఫ్ ఫేమ్‌లో శర్మిళా మోనా సిన్హాకు స్థానం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
అమెరికాలోని నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రముఖ భారతీయ-అమెరికన్ సామాజిక కార్యకర్త శర్మిళా మోనా సిన్హా చోటు దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోల్‌కతాలో జన్మించి వాల్‌స్ట్రీట్‌లో అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం ఈక్వాలిటీ నౌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి తర్వాత ఈ అరుదైన గుర్తింపు సాధించిన రెండో భారతీయ సంతతి మహిళగా ఆమె నిలిచారు.