గ్రామస్థాయిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: వెంకటాచలంలో ఘనంగా మన ఊరు మన జెండా

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామపంచాయతీలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవతో మండలం అభివృద్ధి చెందిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.