తెలంగాణ విమోచన దినాన ఘనంగా వీరుల త్యాగాల స్మరణ
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు అడుప రాజు ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన పోరాటంలో కీలకపాత్ర పోషించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విమోచన ఉద్యమంలో ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.