స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: గోపి స్థలం: కుప్పం

నారావారిపల్లె తనకు జన్మనిస్తే కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కుప్పంలో రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. ఉపాధ్యాయులపై దాడులు చేయడం గర్హనీయమని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.