రూ.4.75 కోట్ల రోడ్డు ధ్వంసంపై కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh

కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజల రాకపోకల కోసం రూ.4.75 కోట్లతో నిర్మించిన రహదారిని అర్ధరాత్రి ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవతో వేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని హెచ్చరించారు.