'ప్రభుత్వ పాలనలో ఆవిష్కరణలు': హర్యానా విశ్వవిద్యాలయంలో కేటీఆర్ లెక్చర్
రిపోర్టర్: రమేష్
స్థలం: హర్యానా
హర్యానా రాష్ట్రం సోనిపట్‌లోని ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు. ప్రభుత్వ పాలనలో ఆవిష్కరణలు: స్టార్టప్ రాష్ట్రం కథ అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీరు, ఇతర రంగాల్లో తీసుకువచ్చిన నూతన విధానాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులకు వివరించినట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.