స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కీవ్

క్రెయిన్లో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించిన మాట వాస్తవమేనని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. సైనిక కార్యకలాపాల కోసం స్టార్లింక్ను ఉపయోగించి సేవా నిబంధనలను ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారమైందని, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు తెలిపారు. పౌరుల అవసరాల కోసం మాత్రమే ఈ సేవలు ఉద్దేశించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.