మధుమేహంపై సోషల్ మీడియా వదంతులు: ప్రాణాలకే ప్రమాదమని వైద్యుల హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: ఫరీదాబాద్
డయాబెటిస్ నియంత్రణపై సాషల్ మీడియాలో ప్రచారమవుతున్న నకిలీ వార్తలు, తప్పుడు వైద్య సలహాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచివుందని యథార్థ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఆన్లైన్ రీల్స్ లేదా ఫార్వర్డ్ మెసేజ్లను నమ్మి మందులు ఆపేయడం వల్ల గుండె, కిడ్నీలకు తీవ్ర నష్టం కలుగుతుందని, వైద్యుల సలహా మేరకే తగిన చికిత్స తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.