నాసా అంతరిక్ష టెలిస్కోప్ భూమి వైపు పయనం: భారత్ లోని పలు నగరాలకు ముప్పు
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ప్రసిద్ధ నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ భూమి వాతావరణంలోకి దూసుకొస్తోందని నాసా మిషన్ చీఫ్ సైంటిస్ట్ బ్రాడ్ సెన్కో స్పష్టం చేశారు. దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం నింగిలోకి పంపిన ఈ భారీ స్పేస్ టెలిస్కోప్ త్వరలోనే భూమిపై పడిపోనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు రీ-ఎంట్రీ జోన్ పరిధిలోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.