ఆసియా క్రీడల ప్రదర్శనపై సమీక్ష: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరియు జాతీయ క్రీడా సమాఖ్యలు అక్టోబర్ పదమూడో తేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత క్రీడలతో పోలిస్తే పతకాల సంఖ్య భారీగా తగ్గడంపై మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. నిధుల కేటాయింపులు, సీనియర్ క్రీడాకారుల ప్రదర్శనలు మరియు గాయాల సమస్యలపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.