తిరుపతి విమానాశ్రయం నిర్వహణను ప్రైవేటు పరం చేయనున్న కేంద్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుపతి
కేంద్ర ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు అప్పగించనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంతో దీనిని బండ్లింగ్ చేసి ప్రైవేటీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని పదకొండు విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.