సాగునీటిరంగ నిపుణుడు రోశయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించిన ప్రముఖ సాగునీటిరంగ నిపుణుడు రోశయ్య బుధవారం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయికి ఎదిగారని కుటుంబ సభ్యులు తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఆయన కీలక సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.