రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న జగదీష్ రెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ కావాలనే రైతులను ఎండబెడుతున్నారని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసినా సరిపడా నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు.