ఎదుటివారికి సమాధానం ఇవ్వకపోతే వారు భావించేది నిజం కాదని అధ్యయనం వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండే వ్యక్తులు తాము చేసిన పనికి లోలోపల ఎంతో బాధపడతారని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే అవతలి వ్యక్తి మాత్రం వారు నిర్లక్ష్యంగా ఉన్నారని తప్పుగా భావిస్తారని పరిశోధకులు సోఫియా లీ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ బులిటెన్ జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు. సమాచార మార్పిడి నిలిపివేయడం వల్ల కలిగే మానసిక ఇబ్బందులపై ఈ అధ్యయనం స్పష్టతనిచ్చింది.