పర్వదిన వేళ పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

వినాయక చవితి పర్వదినం సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో గాజువాక పరిధిలోని గల్లవానిపాలెం గ్రామంలో మరియు వేపచెట్టు కూడలి వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఉచిత మట్టి వినాయకుని విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేడిశెట్టి విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మట్టి విగ్రహాలను స్వీకరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.