తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలో 9,999 కొబ్బరి బోండాలతో ఏర్పాటు చేసిన నందీశ్వర నారీకేళ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కిలో బంగారు ఆభరణాలతో గోల్డెన్ గణేశుడు కొలువుదీరాడు. కడపలో వడ్లతో, గుంటూరులో వనమూలికలు及 జంగిల్ గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినూత్న ప్రతిమలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.