ఖమ్మంలో నిత్యావసర ధరల పెరుగుదలపై సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహణ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం త్రీ టౌన్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, బ్లాక్ మార్కెట్ దందాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మహమ్మద్ సలాం మాట్లాడుతూ ధరలను నియంత్రించి, బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా సరుకులను చౌక ధరలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో నూనె శశిధర్, భూక్య రవీందర్, చిర్రా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.