కోనసీమ వాడపల్లి వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రెండు కోట్లు దాటింది

రిపోర్టర్: మహేష్ స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపులో రికార్డు స్థాయి ఆదాయం లభించిందని దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ముప్పై ఏడు రోజులకు గాను రెండు కోట్ల యాభై లక్షల పదకొండు వేల ఆరువందల డెబ్బై ఒక్క రూపాయల నగదు సమకూరినట్లు ఆయన వెల్లడించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి కానుకలు సమర్పించారని పేర్కొన్నారు.