హీరోయిన్ చర్యతో తప్పిన పెను ప్రమాదం: కెప్టెన్ స్మిత్ మచ్ఛర్కు సెల్యూట్
రిపోర్టర్: సునీల్
స్థలం: నల్గొండ
సమయస్ఫూర్తితో వ్యవహరించి గాల్లో జరగబోయే ఘోర ప్రమాదాన్ని నివారించిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ నిజమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. ఒత్తిడిలోనూ ఆయన చూపిన వృత్తిపరమైన బాధ్యత ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన పట్టుదల, శౌర్యానికి సెల్యూట్ చేస్తున్నానని, దేశమంతా ఆయన పట్ల గర్వపడుతోందని నల్గొండ రాజకీయ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ అభినందించారు.