తెలంగాణ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ శివప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బండ్లగూడ
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.