వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు
రిపోర్టర్: శివ
స్థలం: Warangal
వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. 953 ఎకరాల విస్తీర్ణంలో రూ. 213.59 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, డిసెంబర్ నాటికి టెండర్లు ఖరారు చేసి శంకుస్థాపన చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.