వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
ప్రభుత్వ హామీల అమలుపై వస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. తాము ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, అయితే అవే హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తాము ఎక్కడా స్పష్టంగా చెప్పలేదంటూ అసెంబ్లీ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఆరోపణలను ఆమె తీవ్రంగా తిప్పికొట్టారు.