భక్తిపారవశ్యంతో పులకించిన పాల్వాయి రామాలయ ప్రాంగణం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడు
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలోని శ్రీ రామాలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, సముద్రాల వెంకన్న దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వేదపండితుడు నిమ్మగడ్డ సత్యనారాయణ మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక శోభతో వేడుకలు సాగాయి. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రజాప్రతినిధులు కోరారు. స్థానిక భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.