విషెగ్రాడ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయం
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పోలాండ్, హంగరీ, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాలతో కూడిన విషెగ్రాడ్ గ్రూప్ నేతలతో తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాలతో పాటు ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలని ఈ దేశాలు స్పష్టమైన మద్దతు ప్రకటించాయి.