మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం ఆదరాబాదరా పెళ్లి: టీడీపీ యువనేతకు ఊహించని షాక్

రిపోర్టర్: సురేష్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన టీడీపీ యువనేత వైకుంఠపు హర్షవర్ధన్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ముహూర్తాలు కూడా చూసుకోకుండా ఆదరాబాదరాగా వివాహం చేసుకున్నట్లు దిశ కథనం వెల్లడించింది. బీసీ మహిళకు ఆ స్థానం రిజర్వు కావడంతో, తన ప్రియురాలు మంజీరను ఆయన వివాహం చేసుకున్నారు. అయితే కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో హర్షవర్ధన్ ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి.