రాహుల్, ఖర్గే భేటీ అభ్యర్థనను తోసిపుచ్చిన సీజేఐ: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ఢిల్లీ నిరసనల అంశంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరిన లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ అంశాలు ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నందున పరిపాలనా పరంగా చర్చించడం అధికార విభజన సూత్రానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. నాయకులు న్యాయపరమైన ప్రక్రియ ద్వారా రావాలని సూచించినట్లు సమాచారం.