రజిని భౌతికకాయానికి నివాళులర్పించిన నగిరి నేత విజయ్ బాబు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయపురం
చిత్తూరు జిల్లా విజయపురం మండలం గంగమాంబాపురం గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు భార్య రజని అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ దుర్వార్త తెలుసుకున్న నగిరి నియోజకవర్గ ప్రముఖులు పోతుగుంట విజయ్ బాబు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. రజని భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.