ప్రకృతి మాత పరిరక్షణకై మట్టి గణపతుల పూజ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణ కేంద్రంలో పాల శీతల కేంద్రం వద్ద పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితమై జలచరాలు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని, వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.