మెరకపాలెంలో అరుదైన వింత: ఒకే అరటి మొదలుకు 7 గెలలు ప్రత్యక్షం
రిపోర్టర్: K NAGA SRINU
స్థలం: రాజోలు
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ సమీపంలోని మెరకపాలెంలో అరుదైన ఆశ్చర్యకర దృశ్యం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు ఎలుమర్తి బాబూరావు పొలంలో ఒకే అరటి చెట్టు మొదలు నుండి ఏకంగా 7 అరటి గెలలు తొడిగి అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. సాధారణంగా అరటి చెట్టుకు ఒకే గెల వస్తుండగా, ఇలా ఒకే మొదలు వద్ద ఏడు గెలలు వేయడం చూసేందుకు గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.