నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక అవగాహన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు జిల్లాలో నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసులు విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వద్దు బ్రో, రోడ్డు భద్రత, మహిళలు మరియు బాలల రక్షణ, సైబర్ నేరాలు, చిట్ ఫండ్స్ అలాగే అక్రమ పెట్టుబడులపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.