హైదరాబాద్ జెన్‌ప్యాక్ట్ ఆఫీస్‌లో విషాద వాతావరణం: ఉద్యోగులపై వేధింపులు బట్టబయలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని జెన్‌ప్యాక్ట్ ఆఫీస్‌లో మేనేజర్ వేధింపులు మితిమీరిపోయాయని ఉద్యోగి రోహిత్ కోటానా ఆరోపించారని మనీకంట్రోల్ నివేదించింది. ఛాతిలో నొప్పితో బాధపడుతున్నా ఇంటికి వెళ్లనివ్వలేదని, పానిక్ అటాక్ వచ్చినా పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వివక్ష చూపుతున్నారని ఉద్యోగులు వాపోయారు. ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం స్పందించి స్వతంత్ర అంతర్గత విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేసింది.