లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవోపై సస్పెన్షన్ వేటు

రిపోర్టర్: హరి స్థలం: గుంటూరు

గుంటూరు నగరం గోరంట్లలోని లక్ష్మీ సమేత పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి జి.సురేష్ను సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఆగస్టు 19న జరిగిన హుండీ లెక్కింపులో అవకతవకలు జరగడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం మరియు నగదు లావాదేవీల్లో అనుమానాస్పదంగా వ్యవహరించినట్టు గుర్తించి ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు.