ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ భక్తులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 24 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి బలాపూర్ వరకు ఈ ప్రత్యేక సిటీ సర్వీసులు నడవనున్నాయి. భక్తుల రద్దీని బట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యామ్నాయ సమయాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి.