లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం: జడ్జి ప్రభాకర్‌రావు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆదిలాబాద్

కక్షిదారుల వివాదాలకు లోక్ అదాలత్‌లో శాశ్వత పరిష్కారం లభిస్తుందని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్‌రావు అన్నారు. ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను లాంఛనంగా ప్రారంభించారు. చిన్నపాటి వివాదాలతో కోర్టుల చుట్టూ తిరుగొద్దని, రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.