హైదరాబాద్‌లో హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కఠిన హెచ్చరికలు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ నగరంలో అనుమతులు లేని, భద్రతా ప్రమాణాలు పాటించని హాస్టళ్లను మూడు నెలల్లో మార్చుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే భవనాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, ఉద్యోగుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, అగ్నిమాపక భద్రత తప్పనిసరి అని స్పష్టం చేశారు.