విద్యార్థుల ఆరోగ్యంపై కీలక నిర్ణయం: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
దిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ చికిత్స వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ ఆదివారం తెలిపారు. ఏడాదికి నూట ఎనుబది ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల వేళల్లో విద్యార్థులకు తక్షణ వైద్య సాయం అందించేలా ప్రతి పాఠశాలలోనూ ఒక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తను నియమించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.