జమ్మూ కశ్మీర్‌లో వైద్య విద్యార్థుల నిరాహార దీక్ష, స్టైపెండ్ పెంచాలని డిమాండ్

రిపోర్టర్: విజయ్ స్థలం: జమ్మూ మరియు కశ్మీర్

జమ్మూ కశ్మీర్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్ వైద్య విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. నెలకు రూ. 12,300 ఉన్న స్టైపెండ్‌ను రూ. 30,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అత్యవసర విధులను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.