దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె

రిపోర్టర్: సునీల్ స్థలం: India

యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఐదు రోజుల పనివారం, పెన్షన్ అప్‌డేషన్ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడ్వైజరీ జారీ చేస్తూ, అత్యవసర పనులను ముందే పూర్తి చేసుకోవాలని సూచించింది.