మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగ పశువైద్యులు
రిపోర్టర్: నరేష్
స్థలం: తాడేపల్లి
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయాన్ని నిరుద్యోగ పశువైద్య పట్టభద్రులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. పశుసంవర్ధక శాఖలో వీఏఎస్ పోస్టుల భర్తీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. మెరిట్, వెయిటేజీ విధానంలో పాత జీఓ 52ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం వద్ద బైఠాయించారు.