కొత్తకోటలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన జోష్ మిషన్ విద్యార్థులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: రావికమతం

రావికమతం మండలం కొత్తకోటలో స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. జోష్ మిషన్ టెక్నో స్కూల్ విద్యార్థులు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తగిన ప్రదేశాల్లో వేయాలని నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.