ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమంటూ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రశంస
రిపోర్టర్: రాము
స్థలం: భువనగిరి
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. భువనగిరి పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, దేశభక్తిని అలవర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.