బిగ్‌బాస్ 10లోకి తొలి కంటెస్టెంట్‌గా జానపద సింగర్ ఝాన్సీ ఎంట్రీ

రిపోర్టర్: హరి స్థలం: సూర్యాపేట

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ఆదివారం జరగనుంది. అగ్నిపరీక్ష సీజన్ 2లో విజేతగా నిలిచిన జానపద సింగర్ ఝాన్సీ, 'టికెట్ టు బిగ్‌బాస్' ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్‌గా ఖరారైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఝాన్సీ, తన జానపద పాటలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీజన్ దశావతారం కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించనుంది.