మున్సిపల్ ఎన్నికలు: పోలింగ్ శాతం పెంచాలని శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిపై కూటమి నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్ కు వినియోగించుకునేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యవహరించే అవకాశం ఉన్నందున శ్రేణులు సంయమనం పాటించాలని చంద్రబాబు హెచ్చరించారు.