స్టార్లింక్ ఆరోపణలను ఖండించిన కేంద్రం: శాటిలైట్ సేవల్లో పారదర్శకత స్పష్టం

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విడుదలను స్థానిక బిలియనీర్లు అడ్డుకుంటున్నారంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దేశంలో అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, వివక్ష లేని పారదర్శక నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే జిఎంపిసిఎస్ పరిధిలో మూడు సంస్థలకు టెలికాం లైసెన్సులు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.