ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన ఉష్ణమండల తుఫాను వెల్లడించిన స్కైమెట్ వెదర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh / Telangana

ఆంధ్రప్రదేశ్ తీరంలో కళింగపట్నం సమీపంలో ఉష్ణమండల తుఫాను తీరం దాటిందని స్కైమెట్ వెదర్ సంస్థ వెల్లడించింది. విశాఖపట్నంలో 278 మింటమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. సెప్టెంబర్ 26 వరకు మధ్య, ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల రుతుపవనాల నిష్క్రమణ తాత్కాలికంగా మందగించనుందని స్పష్టం చేసింది. తుఫాను ప్రభావంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.