కుప్పంను శాటిలైట్ టౌన్‌షిప్‌గా మారుస్తామన్న చంద్రబాబు

రిపోర్టర్: అశోక్ స్థలం: కుప్పం

కుప్పంలో భారీగా పెట్టుబడులు రానున్నాయని, బెంగళూరుకు శాటిలైట్ టౌన్‌షిప్‌గా కుప్పం మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పం ప్రాంతానికి భవిష్యత్తులో బుల్లెట్ రైలుతో పాటు విమానాశ్రయం కూడా రానుందని ఆయన వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యల ద్వారా కుప్పం పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.